నిత్యం అధికారుల పర్యవేక్షణ ఉండాలి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగిలో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ధాన్యం సేకరణపై కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి బుధవారం ఖమ్మం నగరంలోని టీడీడీసీ సమావేశ మందిరంలో వ్యవసాయ, మారెటింగ్, రెవెన్యూ, రవాణా, సహకార, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాసంగిలో రైతులు 1.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 2.42 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
యాసంగిలో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ఖమ్మం నగరంలోని టీడీడీసీ సమావేశ మందిరంలో బుధవారం ధాన్యం సేకరణపై వ్యవసాయ, మారెటింగ్, రెవెన్యూ, రవాణా, సహకార, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాసంగిలో రైతులు 1.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 2.42 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలో 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
అధికారులు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తేమ శాతాన్ని నిర్ధారించే పరికరాలు, తూకం మిషన్లు, తూర్పారబట్టే యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా కేంద్రాల్లో రైతులకు తాగునీటి వసతి, షామియానా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే సత్తుపల్లి, కూసుమంచి, కల్లూరు, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, ఏనూరు, తల్లాడ మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ధాన్యాన్ని సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా అధికారులు విజయనిర్మల, రాజేందర్, విజయకుమారి, విద్యాచందన, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణ పక్కాగా ఉండాలి..;వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పువ్వాడ అజయ్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ధాన్యం సేకరణ పక్కాగా ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం నుంచి బుధవారం భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, పౌర సరఫరాలు, సొసైటీ, వ్యవసాయ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు షామియానాలో కూర్చునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ సౌకర్యాలపై చెక్‌లిస్టు సిద్ధం చేయాలని, ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు ధాన్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్, డీఎం ప్రసాద్, సహకార అధికారి వెంకటేశ్వర్లు, డీఏవో అభిమన్యుడు, డీఆర్డీవో మధుసూదన్‌రాజు పాల్గొన్నారు.