కొణిజర్ల, ఏప్రిల్ 13: సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని శాసనసభ్యుడు లావుడ్యా రాములునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 61 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఒక్క కొణిజర్ల మండలంలోనే ఇప్పటివరకు 1,743 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశామన్నారు. నిరుపేదలను ఆదుకోవడానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించారన్నారు. ఆకుపచ్చ తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. సమాఖ్య స్ఫూర్తితో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన కేంద్రం చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వమే కొనేందుకు ముందుకు వచ్చిందన్నారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి ప్రతి గింజా కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోసు మధు, తహసీల్దార్ డి.సైదులు, జడ్పీటీసీ పోట్ల కవిత, ఎంపీటీసీ స్వర్ణలత, సహకార సంఘం అధ్యక్షుడు చెరుకుమల్లి రవి, రైతుబంధు సమితి సభ్యుడు కిలారు మాధవరావు, సర్పంచ్లు సూరంపల్లి రామారావు, చల్లా మోహన్రావు, పరికపల్లి శ్రీను, దొండపాటి లక్ష్మి, కొర్రా కాంతమ్మ, మూడ్ సురేశ్, మాన్సింగ్, చిరంజీవి, రేణుక, షేక్ అఫ్జల్బీ, సూడా డైరెక్టర్ బండారు కృష్ణ, ఎంపీడీవో రమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిరంజీవి, పార్టీ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, కోసూరి శ్రీనివాసరావు, ఏలూరి శ్రీనివాసరావు, దొడ్డపునేని రామారావు, పోగుల శ్రీను, బాబులాల్, రచ్చా రామకోటయ్య, అబూ పాల్గొన్నారు.