ఖమ్మం, ఏప్రిల్ 4: ‘ఖమ్మంలో పుట్టా.. ఖమ్మంలోనే చదువుకున్నా.. ఇక్కడే సైకిల్‌పై చిన్నతనంలోనే చక్కర్లు కొట్టా.. ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు. కాబట్టే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా..’ అన్నారు మంత్రి అజయ్‌కుమార్. 51వ డివిజన్లో రూ.26.80 లక్షల వీడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లను సోమవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ దేవుడని, స్వాతంత్య్రం వచ్చాక ఖమ్మం ఎమ్మెల్యేకి తొలిసారి మంత్రి అయ్యే అవకాశం కల్పించారని అన్నారు. ఈ అవకాశం ఇవ్వడం వల్లనే నిధులు అధికంగా తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేయగలుగుతున్నానన్నారు.
ఈఈ రంజిత్‌కు సన్మానం..
డివిజన్లలో రూ.30 కోట్లతో 150 రోడ్లను నిర్మించిన ప్రజారోగ్యశాఖ ఈఈ రంజిత్‌ను మంత్రి అభినందించారు.
టీఆర్ఎస్లో చేరికలు..
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులైన సీపీఎం, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన 50 కుటుంబాల వారు మంత్రి అజయ్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి పువ్వాడ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు శీలంశెట్టి రమా వీరభద్రం, బుర్రి వెంకట్‌కుమార్, టూటౌన్ కార్యదర్శి జక్కుల లక్ష్మయ్య, నాయకుడు పొన్నం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.