ఖమ్మం రూరల్, ఏప్రిల్ 4: తెలంగాణ రైతులను విస్మరిస్తే కేంద్ర సర్కార్‌ను, బీజేపీ నాయకులను అష్టదిగ్బంధం చేస్తామని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు హెచ్చరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అధ్యక్షతన రైతు నిరసన దీక్ష జరిగింది. మండంలోని నాయుడిపేట హన్మాన్ జంక్షన్లో జరిగిన ఈ దీక్షకు ఆయా గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు. నల్లబ్యాడ్జీలు ధరించి హనుమాన్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తాతా మధు మాట్లాడారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో గత కొద్ది నెలల నుంచి స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నా, టీఆర్ఎస్ ఎంపీలు.. కేంద్రమంత్రులను విన్నవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ ధాన్యం కొనేదాకా రైతుల పక్షాన గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బెల్లం ఉమ, వరప్రసాద్, పేరం వెకంటేశ్వర్లు, అక్కినపల్లి వెంకటేశ్వర్లు, గూడ సంజీవరెడ్డి, వెంపటి రవి, నాగేశ్వరరావు, బానోత్ రెడ్యానాయక్, ముత్యం కృష్ణారావు, కొప్పుల ఆంజనేయులు, మానుకొండ శ్రీనివాస్, మంకెన నాగేశ్వరరావు, నల్లపునేని భాస్కర్‌రావు, వెంకటేశ్వర్లు, బీ.సతీశ్, కనకయ్య, ఉపేందర్, శంకర్రాజు, బానోత్ మోహన్, వీరభద్రం, సుధాకర్, కృష్ణ, ఉదయ్ పాల్గొన్నారు.