ఖమ్మం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం నుంచి దశల వారీగా పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పంచాయతీలు, మండల జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలు ధాన్యం కొనుగోలుపై తీర్మానాలు చేసి ఆ పత్రాలను ప్రధాని మోదీకి పంపించాయి. ఈ ఆందోళనకు కొనసాగింపుగా ఉద్యమాలను ఉధృతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపట్టనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ ఉభయ జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు, జడ్పీ చైర్మన్లు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొననున్నారు.
రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం నుంచి దశల వారీగా పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాలు ధాన్యం కొనుగోలుపై తీర్మానాలు చేసి ఆ పత్రాలను ప్రధాని మోదీకి తపించాయి. ఈ ఆందోళనకు కొనసాగింపుగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రఘునాథపాలెం మండలంలోని మంచుకొండలో రైతులతో కలిసి దీక్షలో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు దీక్షలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీక్షలకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని ఆదేశాలిచ్చారు. దీక్షలో జడ్పీ చైర్మన్లు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొననున్నారు.
కేంద్ర నిర్లక్ష్యంపై నిరసనాస్త్రం..
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర క్యాబినేట్ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంలోని పెద్దలను కలిశారు. ధాన్యం కొనుగోలు చేయాలని విన్నవించారు. దీనిపై రాష్ట్ర కేంద్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి పియూష్ గోయల్ అవహేళనగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని అవమానించారు. ఈ నేపథ్యంలో కేంద్రం మెడలు వంచేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళిక రూపొందించారు. దశల వారీగా పోరాటానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు.
దీక్షలు ఇలా..
మణుగూరులోని అంబేడ్కర్ సెంటర్లో సోమవారం టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఏన్కూరు, వైరా, ఖమ్మం రూరల్ రైతులతో కలిసి దీక్షలో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారులపై 6న నాయకులు రాస్తారోకోలు నిర్వహిస్తారు. 7న జిల్లా కేంద్రాలు, 8న గ్రామాల్లో నిరసన ప్రదర్శన చేపడతారు. ప్రతి రైతు ఇంటిపై నల్లజెండా ఎగురవేసేలా చర్యలు తీసుకుంటారు.
ధాన్యం కొనే వరకు పోరాటం
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన కేంద్రానిదే. అలాకాకుండా కేంద్ర మంత్రులు అవహేళనగా మాట్లాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని మూడేండ్లకు సరిపడా ఆహార నిల్వలు సేకరించాలని ఆహారభద్రత చట్టం చెప్తున్నది. కానీ కేంద్రం చట్టాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం టీఆర్ఎస్ను అస్థిర పరచాలనే కుట్రతో బీజేపీ నేతలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఇప్పటికే పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదు. మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి విన్నవించినా పెడచెవిన పెట్టారు. దీంతో కేంద్రంపై సీఎం కేసీఆర్ యద్ధం ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం ఆగదు. సోమవారం మండల కేంద్రాల్లో చేపట్టే దీక్షను ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి. బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. మన రైతులు, పౌరులను అవమానించిన వారిని ఊరికే వదిలేయొద్దు. కేంద్రం ధాన్యం కొనే వరకు పోరాడుదాం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్