భద్రాచలం, ఏప్రిల్ 2: భద్రాద్రి దివ్యక్షేత్రంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు స్వాగతం పలికేలా ద్వారాలు ఏర్పాటు చేసేందుకు రూ.3.30 లక్షలను కొత్తగూడెం జీవీ మాల్ వస్త్ర దుకాణం యాజమాన్యం విరాళంగా అందించింది. శనివారం రామయ్యను దర్శించుకున్న మాల్ యాజమాన్య బాధ్యులు.. సదరు చెక్కును దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, ఆలయ సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్‌కు అందించారు.
అన్నదాన పథకానికి రూ.లక్ష వితరణ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన పెదప్రోలు వీర వెంకటాచారి దంపతులు రూ. 1,00,116 వితరణగా అందజేశారు. శనివారం ఉదయం రామయ్యను దర్శించుకున్న అనంతరం ఆ దంపతులు చెక్కును ఆలయ అధికారులకు అందజేసి రసీదు స్వీకరించారు.