కేసీఆర్ పాలనపై పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు
జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు కమల్రాజు, కోటేశ్వరరావు
పలు పార్టీల నుంచి 300 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరిక
బోనకల్లు, ఏప్రిల్ 1: తెలంగాణ రాష్ట్రం.. దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని జడ్పీ, టీఎస్ సీడ్స్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని గుర్తుచేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని మరీ విష ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను గమనించి ప్రజలే వాటికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో పలు పార్టీల నుంచి చల్దీ ప్రసాద్, నందిగాం పర్వతాచారి, చల్దీ రవికుమార్, షేక్ మీరాసాహెబ్, బంధం నాగేశ్వరరావుతోపాటు 300 కుటుంబాల వారు శుక్రవారం రాత్రి టీఆర్ఎస్ చేరారు.
ఈ సందర్భంగా వారందికీ జడ్పీ, సీడ్స్ చైర్మన్లు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. నాటి పాలకులు నేడు గ్రామాల్లో తిరుగుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న భట్టి విక్రమార్క ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉనికి కోసమే పాదయాత్ర చేస్తూ డ్రామా ఆడుతు న్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు మల్లికార్జునరావు, ప్రసాద్, బీజాన్బీ, కొండా, నాగేశ్వరరావు, నాగరాజు, బాబు, నాగేశ్వరరావు, సీతారాములు, నజీర్, ఇబ్రహీం, నాగేశ్వరరావు, వెంకటరాజ్యం, హుస్సేన్ పాల్గొన్నారు.