బోనకల్లు, మార్చి 31 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మండలంలో పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఆయన గురువారం అందజేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నదని ఎవరికీ తెలియదన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో నాయకులు చేబ్రో లు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, వేమూరి ప్రసాద్, బంధం శ్రీనివాసరావు, బానోత్ కొండ, జెర్రిపోతుల రవీందర్, తొండపు వేణు, తమ్మారపు బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు,పాపినేని రామారావు, షేక్ నజీర్, కొనకంచి నాగరాజు, పారా ప్రసాద్, సూర్యదేవర సుధాకర్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, కనకయ్య, శ్రీనివాసరావు, నాగరాజు, చంద్రం, షేక్ జానీ, హనుమంతరావు, రెడ్డెబోయిన ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.
స్థలం కోసం వినతి : నియోజకవర్గంలో క్రైస్తవుల సమాధుల కోసం స్థలాన్ని కేటాయించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కకు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు పాపగంటి రాజారత్నం వినతిపత్రాలను గురువారం అందజేశారు. కార్యక్రమంలో ఎర్నెస్ట్పాల్, జోసఫ్, జయాకర్, రత్నబాబు, పౌల్, యోహాను, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మధిరటౌన్, మార్చి 31 : జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు గురువారం మధిర పట్టణంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పల్లపోతుల వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, వై.వీ. అప్పారావు, నరేందర్‌రెడ్డి, ప్యారీ తదితరులు పాల్గొన్నారు.
మధిరరూరల్, మార్చి31 : మండలంలో జడ్పీ చైర్మన్ లింగాల గురువారం పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో చిత్తారు నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.