భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మార్చి 20: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రైటర్‌బస్తీ ఎల్ఐసీ కార్యాలయం పక్కన ఉన్న కార్యాలయాన్ని ఆయన పరిశీలించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
సమీకృత కలెక్టరేట్ పనుల పరిశీలన
జిల్లా కేంద్రం సమీపంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ వద్ద కేఎస్ఎం సమీపంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.