పెనుబల్లి, మార్చి 19: “టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నెన్నో పథకాలతో రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నది. ఇది ఇలాగే కొనసాగాలంటే.. టీఆర్ఎస్ పా ర్టీని, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆదరించాలి. మద్దతుగా నిలవాలి. దీనికి కృతజ్ఞతగా, బాధ్యతగా ప్రభుత్వం, పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది” అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని లింగగూడెం, ముత్తగూడెం, లంకపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబాలను ఆయన శనివారం పరామర్శించారు. పార్టీ సభ్యత్వ బీమా చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. “పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ.. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నది.. కాపాడుకునేది మాత్రం టీఆర్ఎస్ ఒక్కటే” అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తూ మృతిచెందితే రెండులక్షల రూపాయలను అందిస్తున్నట్లు చెప్పారు.
“టీఆర్ఎస్.. ఓ కుటుంబంలాంటిది. అందుకే, కుటుంబ సభ్యులను కష్టకాలంలో ఆదుకునేందుకు పార్టీ సభ్యత్వ బీమా పథకాన్ని అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టారు” అని చెప్పారు. “టీఆర్ఎస్ పార్టీని ఆదరించండి. అవసరమైన ప్రతి సందర్భంలోనూ మద్దతుగా నిలవండి. మీకు మేము (నాయకత్వం) అండగా నిలుస్తాం” అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, జడ్పీటీసీ మెంబర్ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, సర్పంచ్‌లు తిరుమలశెట్టి నాగదాసు, పద్దం వెంకటేశ్వర్లు, గాయం వెంకటేశ్వర్లు, శీలం నాగిరెడ్డి, బెల్లంకొండ చలపతిరావు, కనగాల సురేష్‌బాబు, గువ్వల వెంకటరెడ్డి, చీకటి రామారావు, చెలికాని నీలాద్రి బాబు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
కల్లూరు, మార్చి 19: మండలంలో ఇటీవల మృతిచెందిన షేక్ జానిమియా, షేక్ ఖాసీంబీ (పుల్లయ్యబంజర రోడ్), గుండ్ల ప్రసన్న (గోపాలకుంట), వేము దావీదు (కల్లూరు అంబేద్కర్ నగర్) కుటుంబీకులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పరామర్శించారు. చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, యాకూబ్ అలీ, కాటంనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని దేవీ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు వేముల సత్యనారాయణ మాతృమూర్తి రంగనాయకమ్మ ఇటీవల మృతిచెందారు. శనివారం ఆమె సంస్మరణ సభకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, నాయకుడు అమరవరపు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని నూతనకల్ మాజీ సర్పంచ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ శెట్టిపల్లి లక్ష్మణరావు కుమార్తె ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆమెను ఎమ్మెల్యే సండ్ర శనివారం పరామర్శించారు.
మండలంలోని లంకాసాగర్లో ఇటీవల మృతి చెందిన పిచ్చిరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనగాల వెంకటరావు, చెక్కిలాల మోహన్‌రావు, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, అశోక్, తాళ్లూరి శేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
మండలంలోని ముత్తగూడెం గ్రామస్తురాలు బొగ్గుల రోశమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి వచ్చిన రెండులక్షల రూపాయల చెక్కును ఆమె ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందజేశారు.