మధిరటౌన్, రూరల్ మార్చి 19: రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్‌యార్డులో రూ.28 లక్షలతో నిర్మించిన రైతువేదికను జడ్పీచైర్మన్ కమల్‌రాజుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ నామా మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నదన్నారు. జడ్పీచైర్మన్ కమల్‌రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, బ్యాంకులకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండానే రూ.10 లక్షలు నేరుగా అందించే గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం రాయపట్నంలో రైతువేదికను, ఇల్లూరులో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నామా
పట్టణంలో ఎంపీ నామా నాగేశ్వరరావు జడ్పీ చైర్మన్ కమల్‌రాజుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్కూరు సర్పంచ్ సంధ్యారాణి భర్త రామకృష్ణ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆయనను పరామర్శించారు. అనంతరం వీరమాచినేని శ్రీనివాస్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మక్కెన నాగేశ్వరరావు మాతృమూర్తి ఇటీవల మృతిచెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు బొమ్మెర రామ్మూర్తి, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, ఎంపీపీ లలిత, వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేణు, సొసైటీ చైర్మన్ కృష్ణప్రసాద్, మున్సిపల్ వైస్‌చైర్మన్ విద్యాలత, మండల పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, కళ్యాణికిరణ్, వరలక్ష్మి, ఓంకార్, సర్పంచ్‌లు సుశీల, రామరావు, వీ నాగేశ్వరరావు, రామకృష్ణ, దుర్గ, శ్రీనివాస్‌రావు, అరిగె శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి, మాధురి, మాధవి, నరేందర్‌రెడ్డి, రామన్, అప్పారావు, ఇక్బాల్, ప్యారీ, కొండయ్య, వినయ్‌కుమార్, ఉద్దండయ్య పాల్గొన్నారు.