ఖమ్మం రూరల్, మార్చి 19: త్వరలోనే మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు చర్యలు చేపట్టాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మద్దులపల్లి మార్కెట్‌కు సంబంధించిన రహదారి పనులను పరిశీలించారు. మార్కెట్ శంకుస్థాపన కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, వైస్‌చైర్మన్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు, సర్పంచ్ కే సుభద్ర, దర్మారెడ్డి, ఎస్ఈ లక్ష్మణ్‌గౌడ్, డీఈ సమాధానం, ఏఈ సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.
26 కుటుంబాలకు రూ.2.60 లక్షల ఆర్థిక సాయం
మండలంలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే కందాళ సతీమణి విజయమ్మ పరామర్శించారు. తొలుత గొల్లగూడెం, కొండాపురం గ్రామాలకు వచ్చిన విజయమ్మకు స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్, ఎంపీపీ ఉమతో కలిసి బాధిత కుటుంబాలకు సాయం అందజేశారు. చింతపల్లి, ఆరెకోడు, ముత్తగూడెం, గ్రామాల్లో మరో 8 కుటుంబాలకు రూ.80వేలు అందించారు. పోలెపల్లి, గోళ్లపాడు గ్రామాల్లో మరో 9 కుటుంబాలకు రూ. 90 వేలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు కందాళ కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.
గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టండి
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం చాలా సంతోషకరమని, కూలీలకు మంచిగా పనులు కల్పిస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కందాళ అన్నారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నాలుగు మండలాల ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యులు ఎమ్మెల్యేను కలిసి , సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రామసహాయం బాలకృష్ణా రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వీరయ్య, నాయకులు నాగేశ్వరరావు, పరశురాం, వీరారెడ్డి, సైదులు, రమాదేవి, రాంబాబు, తారాచంద్, మల్లేశం, రమేశ్, శంకర్, ప్రకాశ్, నాగేశ్వరరావు, మల్లయ్య పాల్గొన్నారు.
విద్యార్థికి ఆర్థిక సాయం
మండలంలోని గోరీలపాడు తండాకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి బానోత్ లాల్‌సింగ్‌కు ఎమ్మెల్యే కందాళ రూ.50 వేలు సాయాన్ని క్యాంపు కార్యాలయంలో శనివారం అంజేశారు.