
కారేపల్లి, జూలై 7: హరితహారంలో నాటిన మొక్కలన్నింటినీ సంరక్షించాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శమని అన్నారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా కారేపల్లి సర్పంచ్ ఆదెర్ల స్రవంతి ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని డివైడర్‌పై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సంత దేవాలయ చైర్మన్ మల్లె నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకులు తిరుపతిరావు, రాంబాబు, అజ్మీరా వీరన్న, ఎండీ హనీఫ్, బానోత్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాములునాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.