వేంసూరు, మార్చి 19 : తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన కల్యాణ మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రెండు రాష్ర్టాల స్థాయి మహిళా కబడ్డీ పోటీల బహుమతి ప్రదానోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు మర్లపాడు నుంచి కందుకూరు వరకు 500 బైక్‌లు, 100కార్లతో స్వాగతం పలికారు. బహుమతి ప్రదానోత్సవం అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మధ్య కాలంలో మహిళాబంధుగా సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నట్లు గుర్తుచేశారు.
మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ బడుగు, బలహీన వర్గాలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దేశానికే తలమానికంగా నిలుస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమమహేశ్వరరావు, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, మహిళా క్రీడల కన్వీనర్ గొర్ల ప్రభాకర్‌రెడ్డి, బండి ఉపేందర్‌రెడ్డి, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బొంతు శ్రీనివాసరావు, పీడీలు, పీఈటీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కందుకూరుకు భారీ కార్ల ర్యాలీ
సత్తుపల్లి టౌన్ : వేంసూరు మండలం కందుకూరులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా సత్తుపల్లి నుంచి కందుకూరుకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో భారీ మోటర్‌సైకిల్, కార్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీ సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కాకర్లపల్లి రోడ్డు వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి ప్రధాన రహదారి మీదుగా వేంసూరు రోడ్డు నుంచి కొత్తూరు, లింగపాలెం, వేంసూరు, మర్లపాడు మీదుగా కందుకూరు చేరుకుంది.
ముగిసిన ఎడ్లబండ లాగుడు పోటీలు
వేంసూరు : కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో శనివారం ముగింపు వేడుకల్లో విజేతలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అతి సమీపంగా ఉండే ఎడ్లపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎడ్ల బండలాగుడు పోటీలను మహిళలు సైతం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తిలకించడం విశేషం. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా నాయకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కమిటీ నిర్వహకులు గొర్ల సత్యనారాయణరెడ్డి, నాయకులు అట్లూరి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.