పాల్వంచ రూరల్, మార్చి 18 : మండలంలోని జగన్నాధపురం-కేశవాపురం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో శుక్రవారం చండీహోమం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. మేళతాళాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించి యాగశాలకు తీసుకొచ్చారు. యాగశాలలో మండపారాధన, గణపతి పూజలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పందొమ్మిది మంది దంపతులు హోమంలో పాల్గొన్నారు. శ్రీకనకదుర్గ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయ చైర్మన్ మహీపతి రామలింగం, ధర్మకర్తలు చింతా నాగరాజు, గంధం వెంగళారావు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, మాళోతు సువాలి, కిలారు నాగమల్లేశ్వరావు పాల్గొన్నారు.