పాల్వంచ, డిసెంబర్ 11: పాల్వంచ పట్టణంలోని ఆడమ్స్ కాలేజీ మామిడి తోటలో ఆదివారం బంజారా (గోర్‌మాటి) ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా జరిగింది. ముందుగా కేటీపీఎస్ కాలనీలోని ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుంచి జంజారాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా పురవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అలాగే యువకులు బైక్ రాలీ నిర్వహించారు. అనంతరం ఆడమ్స్ కాలేజీ మామిడి తోటలో సంప్రదాయబద్ధంగా వారి ఆచారం ప్రకారం భోగ్‌బండార్ సహా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడీ మహిళలు, చిన్నారులు నృత్యాలతో అలరింపజేశారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహా ఆలయ స్తపతి మాతీలాల్, ఎవరెస్టు శిఖర అధిరోహికురాలు మాలోత్ పూర్ణలను నిర్వాహకులు సన్మానించారు. నిర్వాహకులు రమేశ్ రాథోడ్, చందూనాయక్, వీరూనాయక్, బాలు, హిరణి గాంధీ, బీఎస్ రావ్, బిందు పల్లవి, రాంచందర్, శంకర్‌నాయక్, ఈశ్వర్, దుర్గాప్రసాద్, మోహన్‌కుమార్, మోహన్‌సింగ్, జగన్, వెంకట్, మంగీలాల్, రాంబాబునాయక్, రమేశ్, బానోత్ రవి తదితరులు పాల్గొన్నారు.