తొక్కినా వెళ్తుంది.. తొక్కకపోయినా వెళ్తుంది..!
దీని ప్రత్యేకతలు చూద్దాం. ఇది ఎలక్ట్రిక్ సైకిల్. సైకిల్ కం (ఎలక్ట్రిక్) బైక్ లాంటిది అన్నమాట. దీనికి చార్జింగ్ బ్యాటరీ ఉంటుంది.
లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 25;దీని ప్రత్యేకతలు చూద్దాం. ఇది ఎలక్ట్రిక్ సైకిల్. సైకిల్ కం (ఎలక్ట్రిక్) బైక్ లాంటిది అన్నమాట. దీనికి చార్జింగ్ బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ (చార్జ్) కావాలంటే ఏడు గంటలపాటు చార్జింగ్ పెట్టాలి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే.. సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటలో 25 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. బ్యాటరీ డౌన్ అయిందనుకోండి. అప్పుడు సాధారణ సైకిల్‌లాగా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. బైక్‌కు మాదిరిగానే దీనికి కూడా సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. వెనుక మరొకరు కూర్చునేందుకు సీటు ఉంది. సామాన్లు పెట్టుకునేందుకు ఏర్పాటు కూడా ఉంది. దీనికి రోడ్ ట్యాక్స్ ఉండదు. బ్యాటరీకి రెండేళ్లపాటు కంపెనీ వారంటీ ఉంది. ఈ సైకిల్ ధర రూ.50వేలు. కొత్తగూడెం నివాసి సునీల్‌కుమార్, ఈ సైకిల్‌ను 15 రోజుల క్రితం కొన్నారు. “దీనికి పెట్రోల్ ఖర్చు, కాలుష్యం బెడద ఉండదు. ఎలక్ట్రిక్ బైక్‌కూ, దీనికీ తేడా ఏమిటన్న సందేహం మీకు రావచ్చు. ఎలక్ట్రిక్ బైక్ అయితే.. బ్యాటరీ డౌన్ అయినప్పుడు ముందుకు కదలదు. ఈ సైకిల్‌కు ఆ సమస్య లేదు. బ్యాటరీ ఉన్నా.. లేకున్నా నడుస్తుంది. దీని ప్రత్యేకతల్లో ఇది ప్రధానమైనది” అని సునీల్‌కుమార్ వివరించారు. “దీనిపై ప్రయాణం నాకు సంతృప్తిగా ఉంది. కాళ్లల్లో ఓపిక ఉన్నంత వరకు తొక్కుతాను. ఆ తర్వాత, బ్యాటరీ సాయంతో పరుగెత్తిస్తాను” అన్నారు హాయిగా నవ్వుతూ.
–
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

