నిరంతర అధ్యయనం ముఖ్యం
సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి..
సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులు
ఖమ్మం నగరంలో విద్యార్థులతో ముఖాముఖి
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11 : ప్రణాళికతో చదివితేనే ఒత్తిడి దూరమవుతుందని, విజయం చేరువవుతుందని ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతున్న అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏడుగురు శిక్ష ణ అధికారులు తమను తాము పరిచయం చేసుకుంటూ విద్యార్హతలతోపాటు వారు ఎంపికైన సర్వీసెస్ గురించి వివరించారు. సివిల్ సర్వీసెస్ సాధించడానికి మార్గదర్శకంగా నిలిచినదెవరు..? రోజుకి ఎన్ని గంటలు చదివేవారు..? ఒత్తిడిని తొలగించేందుకు ఏమి చేయాలి..? అని అభ్యర్థులు తమ సందేహాలను అడిగారు. వీటికి వా రు సమాధానమిస్తూ…. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చదువుతారని, ఎన్ని గంటలు చదివామనేది ముఖ్యం కాదు, ప్రతిరోజు కంటిన్యూటి ఉండాలన్నారు.
పుస్తకాలను కా కుండా సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సూ చించారు. నిరంతర సాధనతోపాటు అన్నింటిపై దృష్టి సారిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. ప్రధానంగా బడ్జెట్‌పై అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. పోటీ పరీక్షల సమయాన్ని బట్టి ప్రణాళిక రూపొందించుకోవాలని, ఎమోషనల్‌గా ఉండకూడదని అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని వివరించారు. సివిల్ సర్వీసెస్ అధికారులను ప్రశ్నలు అడిగే సమయంలో కొందరు విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు తడబడుతుండడంతో తెలుగులో మాట్లాడాలని సూచించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి మంచినీరు అందించి కంగారుపడొద్దని చెప్పడంతో అక్కడున్న విద్యార్థులంతా చప్పట్లు కొట్టారు. శిక్షణ అధికారులు వికాస్కుమార్, కునిశాల్, శివశ్రీ, రాంసుందర్, దేబర్రాజ్దాస్, అనుపమ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కార్యదర్శి మంజువాణి, సిబ్బంది రాజు, ఉమాం, అఖిల్, భాస్కర్, 400మంది అభ్యర్థులు పాల్గొన్నారు.