యువతికి అండగా నిలిచిన వ్యక్తిపై కక్షకొలిక్కి వచ్చిన రాహుల్‌రెడ్డి హత్య కేసుపోలీసుల అదుపులో నిందితుడు
కొత్తగూడెం క్రైం, నవంబర్ 21: ప్రేమ పేరుతో తాను వెంట పడుతున్న యువతికి అండగా నిలిచిన వ్యక్తిని స్నేహం పేరుతో నమ్మించి హతమార్చాడో ఓ జులాయి. తనను మందలించాడన్న ప్రతీకారంతో తల్వార్‌తో మృగంలా వెంటాడి అడ్డు తొలగించుకున్నాడో ఉన్మాది. పాపం ఆ యువతికి అండగా ఉందామనుకున్న ఆ వ్యక్తి హత్యతో అతడి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.. మంచి ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో ఆనందంగా ఉన్నాడుకున్న కొడుకు మరణవార్తతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి..
కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్ బాబు సోమవారం సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు వివరాలను వెల్లడించారు.వరంగల్‌లోని జవహర్‌నగర్‌కి చెందిన వీరెడ్డి రాహుల్‌రెడ్డి(30) హైదరాబాద్‌లో నర్సింగ్ చేస్తున్న వింధ్యారాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి దేవాన్షు విహాల్ ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. రాహుల్‌రెడ్డి ఆరునెలల క్రితం కొత్తగూడెం వచ్చి పట్టణంలోని గణేశ్ టెంపుల్ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా రామవరంలోని సీఆర్పీ క్యాంపునకు చెందిన జంజర్ల జానకిరామ్ అనే యువకుడు రాహుల్ పనిచేస్తున్న ల్యాబ్‌లో పనిచేసే యువతి వెంట పడి ప్రేమిస్తున్నానని వేధించడం మొదలుపెట్టాడు.
విషయం తెలుసుకున్న రాహుల్ జానకిరామ్‌కి నచ్చజెప్పే ప్రయత్నంలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో రాహుల్ సెప్టెంబర్‌లో జానకిరామ్‌పై త్రీ టౌన్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అదే సమయంలో సదరు యువతి సైతం చేసిన ఫిర్యాదు మేరకు జానకిరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రాహుల్ రెండు వారాల క్రితం ల్యాబ్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అక్కడి నిర్వాహకులు పేర్కొన్నారు. ఇటీవలే రాహుల్ హైదరాబాద్‌లోని మరో సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లి ఎంపికై వచ్చినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.
కేసు నమోదైనప్పటి నుంచి రాహుల్‌పై కక్ష పెంచుకున్న జానకిరామ్ ఎలాగైనా తనను హతమార్చాలని భావించి, అతడితో స్నేహం చేసినట్లు నమ్మించాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం రాహుల్‌ని మందు పార్టీకి సీఆర్పీ క్యాంపు వద్దకు పిలిచి అక్కడ మద్యం తాగారు. జానకిరామ్ ఇదే అదునుగా రాహుల్‌తో వాదనకు దిగి అతడిపై దాడికి పాల్పడ్డాడు. జానకీరామ్ తనతో తెచ్చుకున్న తల్వార్‌ను చూసి రాహుల్ పారిపోయే ప్రయత్నంలో అక్కడే ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. రాహుల్‌ని వెంటాడిన జానకిరామ్ తల్వార్‌తో అతి దారుణంగా నరికి హతమార్చినట్లు డీఎస్పీ పేర్కొ న్నారు. నిందితుడు జానకిరామ్ పోలీసుల ఎదుట లొంగి పోయాడని, అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ ఇన్స్పెక్టర్ రాజు కేసు నమోదు చేశారు. రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్య నారాయణ, ఎస్సై జుబేదా, సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తగూడెం క్రైం, నవంబర్ 21: ప్రేమ పేరుతో తాను వెంట పడుతున్న యువతికి అండగా నిలిచిన వ్యక్తిని స్నేహం పేరుతో నమ్మించి హతమార్చాడో ఓ జులాయి. తనను మందలించాడన్న ప్రతీకారంతో తల్వార్‌తో మృగంలా వెంటాడి అడ్డు తొలగించుకున్నాడో ఉన్మాది. పాపం ఆ యువతికి అండగా ఉందామనుకున్న ఆ వ్యక్తి హత్యతో అతడి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.. మంచి ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో ఆనందంగా ఉన్నాడుకున్న కొడుకు మరణవార్తతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి..
కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్ బాబు సోమవారం సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు వివరాలను వెల్లడించారు. వరంగల్‌లోని జవహర్‌నగర్‌కి చెందిన వీరెడ్డి రాహుల్‌రెడ్డి(30) హైదరాబాద్‌లో నర్సింగ్ చేస్తున్న వింధ్యారాణిని వివాహం చేసుకున్నాడు. వీరికి దేవాన్షు విహాల్ ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. రాహుల్‌రెడ్డి ఆరునెలల క్రితం కొత్తగూడెం వచ్చి పట్టణంలోని గణేశ్ టెంపుల్ ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా రామవరంలోని సీఆర్పీ క్యాంపునకు చెందిన జంజర్ల జానకిరామ్ అనే యువకుడు రాహుల్ పనిచేస్తున్న ల్యాబ్‌లో పనిచేసే యువతి వెంట పడి ప్రేమిస్తున్నానని వేధించడం మొదలుపెట్టాడు.
విషయం తెలుసుకున్న రాహుల్ జానకిరామ్‌కి నచ్చజెప్పే ప్రయత్నంలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో రాహుల్ సెప్టెంబర్‌లో జానకిరామ్‌పై త్రీ టౌన్ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అదే సమయంలో సదరు యువతి సైతం చేసిన ఫిర్యాదు మేరకు జానకిరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రాహుల్ రెండు వారాల క్రితం ల్యాబ్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అక్కడి నిర్వాహకులు పేర్కొన్నారు. ఇటీవలే రాహుల్ హైదరాబాద్‌లోని మరో సంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లి ఎంపికై వచ్చినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదైనప్పటి నుంచి రాహుల్‌పై కక్ష పెంచుకున్న జానకిరామ్ ఎలాగైనా తనను హతమార్చాలని భావించి, అతడితో స్నేహం చేసినట్లు నమ్మించాడు.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం రాహుల్‌ని మందు పార్టీకి సీఆర్పీ క్యాంపు వద్దకు పిలిచి అక్కడ మద్యం తాగారు. జానకిరామ్ ఇదే అదునుగా రాహుల్‌తో వాదనకు దిగి అతడిపై దాడికి పాల్పడ్డాడు. జానకీరామ్ తనతో తెచ్చుకున్న తల్వార్‌ను చూసి రాహుల్ పారిపోయే ప్రయత్నంలో అక్కడే ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. రాహుల్‌ని వెంటాడిన జానకిరామ్ తల్వార్‌తో అతి దారుణంగా నరికి హతమార్చినట్లు డీఎస్పీ పేర్కొ న్నారు.
నిందితుడు జానకిరామ్ పోలీసుల ఎదుట లొంగి పోయాడని, అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు టూటౌన్ ఇన్స్పెక్టర్ రాజు కేసు నమోదు చేశారు. రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ బత్తుల సత్య నారాయణ, ఎస్సై జుబేదా, సిబ్బంది పాల్గొన్నారు.