కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కారేపల్లి, మార్చి 11 : ఉద్యోగ నియాకాలను పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి లక్ష కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ఘనుడు సీఎం కేసీఆర్ అని కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీఆర్ఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు మురారిశెట్టి వనిత, కవిత, పార్థసారధి, లక్ష్మీనారాయణ, యాకయ్య, రాంబాబు, బాబూరావు, విజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, ఎంపీటీసీ ఇమ్మడి రమాదేవి, సంత దేవాలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోతు శ్రీను, అజ్మీరా యుగంధర్, ఎండీ హనీఫ్, రోషయ్య, బత్తుల శ్రీనివాసరావు, నాగేంద్రబాబు, తొగర శ్రీను, రాంకిషోర్, ఆదెర్ల రామారావు పాల్గొన్నారు.
సుందరయ్యనగర్‌లో
ఇల్లెందు, మార్చి 11 : పట్టణంలోని సుందరయ్యనగర్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు రంగనాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. అసెంబ్లీలో ఉద్యోగ నియామకాల గురించి సీఎం స్వయంగా ప్రకటించడంపై టీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు బానోత్ ధర్మనాయక్, శీలం రమేశ్, రేణుక, దాసం ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11 : ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రకటన హర్షణీయమని, ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయని గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నిరుద్యోగుల బంధువు కేసీఆర్ అని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి, ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.