వైరా టౌన్, నవంబర్ 18: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రొయ్య పిల్లలు, చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసిన సుమారు 7.18 లక్షల రొయ్య పిల్లలను వైరా రిజర్వాయర్ బతుకమ్మ ఘాట్ వద్ద శుక్రవారం ఆయన విడుదల చేశారు.
ఎఫ్డీవో బుచ్చిబాబు, మత్స్య సహకార సంఘం చైర్మన్ షేక్ రహీం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా రిజర్వాయర్లో సుమారు 1,200 మంది మత్స్యకారులు చేపల వేట ఆధారంగానే జీవిస్తున్నారని అన్నారు. ఈ రొయ్య పిల్లలు, చేప పిల్లలను పెంచుకొని వాటి వేట ఆధారంగా ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని, నాయకులు కట్టా కృష్ణార్జున్రావు, మచ్చా బుజ్జి, మిట్టపల్లి నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.