మధిర టౌన్, నవంబర్ 2: ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆదేశించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో నీటిఎద్దడికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందించాలన్నారు. మడుపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కొందరు కోరగా వెంటనే జడ్పీ చైర్మన్ స్పందించారు.
విద్యుత్‌శాఖ అధికారులను పురమాయించి ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీవోకు సూచించారు. మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 8న అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని ఫోన్లో డీఎంఅండ్‌హెచ్‌వో మాలతి ఆదేశించారు. అనంతరం రామభక్త సీతయ్య కళాపరిషత్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే బాలోత్సవ్ బ్రోచర్లను ఆయన విడుదల చేశారు. చిరువ్యాపారులు వారి సమస్యలపై జడ్పీచైర్మన్‌కు వినతిపత్రం అందజేశారు.