జూలూరుపాడు, నవంబర్ 2 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 31మంది కల్యాణలక్ష్మి్మ, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.31,3596 విలువైన చెక్కులు, ఆరుగురు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.1,2600 విలువైన చెక్కులను మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.
తెలంగాణ పథకాలపై దేశంలోని అన్ని రాష్ర్టాల సీఎంలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్లే విధంగా పంచాయతీలకు ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నదన్నారు. అంతిమయాత్ర గౌరవప్రదంగా జరిగేందుకు ప్రతి గ్రామంలో శ్మశానవాటికలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు.
కార్యక్రమంలో తహసీల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీపీ లావుడ్యా సోని, సహకార సంఘం అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, సర్పంచ్‌లు విజయ, కిషన్‌లాల్, రాములు వైస్ ఎంపీపీ గాదె నిర్మల, ఎంపీటీసీలు పొన్నెకంటి సతీశ్‌కుమార్, దుద్దుకూరి మధుసూదన్‌రావు, పెండేల రాజశేఖర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యదళ్లపల్లి వీరభద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌడం నర్సింహారావు, కార్యదర్శి నున్నా రంగారావు, నాయకులు మోదుగు రామకృష్ణ, మల్లెల నాగేశ్వరరావు, చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకూరి కృష్ణప్రసాద్, రామిశెట్టి నాగేశ్వరరావు, దేవీలాల్ తదితరులు పాల్గొన్నారు.