కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 28 : పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయం నుంచి పాఠశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఓపెన్ హౌస్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యాట్లాడుతూ.. విధి నిర్వహణలో దేశం కోసం అమరులైన పోలీసులను స్మరించుకునేందుకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విద్యార్థులకు తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. జిల్లాలో మొత్తం 750మందికి పైగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పోలీసులు ఉపయోగించే వివిధ రకాల ఆయుధాల పనితీరు, అవి పని చేసే విధానాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కేవీఆర్ సత్యనారాయణ, అర్ఐ దామోదర్, బాంబ్ డిస్పోజల్ స్కాడ్, సిబ్బంది పాల్గొన్నారు.