ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 4 : ప్రతికూల పరిస్థితిలోనూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని మించిన ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. పత్తి, అపరాల పంటల దిగుబడి ఈ ఏడాది ఆశించిన మేర రాకపోయినప్పటికీ, గత ఏడాది కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వలు పూర్తిగా లేకున్నప్పటికీ రికార్డుస్థాయిలో ఆదాయం సొంతం చేసుకోవడం విశేషం. సీజన్ ఆరంభంలో మిర్చిపంటకు మంచి ధర రావడంతో మార్కెట్‌కు భారీగా ఆదాయం సమకూరింది. లక్ష్యాన్ని మించి ఆదాయం రావడానికి ఇదే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఖరీదుదారులు సైతం మార్కెట్ ఫీజు సకాలంలో చెల్లించడంతో మార్గం సుగమం అయ్యింది. ఈ సంవత్సరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రూ.26.14 కోట్లను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ టార్గెట్ విధించింది. దీంతో ఈ సంవత్సరం మార్చి 31నాటికి రూ.27.61 కోట్ల ఆదాయం సొంతం చేసుకుంది. 2022-23 సంవత్సరం ఇదే మార్కెట్ లక్ష్యం రూ.25.27 కోట్లు కాగా రూ.26.07 కోట్లను సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం సుమారుగా 12 లక్షల మిర్చిబస్తాలు కోల్డ్ స్టోరేజీలకు వెళ్లినప్పటికీ టార్గెట్‌ను మించి రూ.1.50 లక్షల వరకు అదనంగా ఆదాయం సొంతం చేసుకోవడంతో మార్కెట్ కమిటీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా మార్కెటింగ్‌శాఖ పరిధిలో ప్రస్తుతం 8 వ్యవసాయ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి గాను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ జిల్లా మార్కెటింగ్‌శాఖకు రూ.54.39 కోట్ల లక్ష్యం పెట్టింది. అందుకు అనుగుణంగానే మార్చి 31నాటికి జిల్లా మార్కెటింగ్‌శాఖకు రూ.57.80 కోట్ల ఆదాయం రావడంతో టార్గెట్‌ను మించి ఆదాయం సొంతం చేసుకున్నైట్లెంది. మార్కెట్లవారీగా ఆదాయాలు పరిశీలిస్తే.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ టార్గెట్ రూ.26.14 కోట్లు కాగా రూ.27.61 కోట్లు సొంతం చేసుకుంది. మధిర వ్యవసాయ మార్కెట్ టార్గెట్ రూ.4.34 కోట్లు కాగా రూ.4.55 కోట్లు, నేలకొండపల్లి టార్గెట్ రూ.4.05 కోట్లు కాగా రూ.3.91 కోట్ల ఆదాయం సమకూరింది. కల్లూరు టార్గెట్ రూ.4.17 కోట్లు కాగా రూ.4.84 కోట్లు, వైరా టార్గెట్ రూ.4.72 కోట్లు కాగా రూ.5.78 కోట్లు, ఏన్కూర్ లక్ష్యం రూ.4.14 కోట్లు కాగా రూ.4.49 కోట్లు. సత్తుపల్లి లక్ష్యం రూ.3.75 కోట్లు కాగా రూ.4.78 కోట్లు ఆదాయం వచ్చింది. అదేవిధంగా మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ లక్ష్యం రూ.3.08 కోట్లు కాగా రూ.1.82 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. సీసీఐ నుంచి రావాల్సిన ఆదాయం సమకూరితే మద్దులపల్లి మార్కెట్ సైతం లక్ష్యాన్ని చేధించే అవకాశం ఉంది. ఏదిఏమైనా 2023-24 సంవత్సరానికి గాను జిల్లా మార్కెటింగ్‌శాఖ పరిధిలోని అన్ని మార్కెట్లు మంచి పురోగతి సాధించడంతో మార్కెటింగ్‌శాఖ లక్ష్యాన్ని మంచి ఆదాయం అందుకున్నైట్లెంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లక్ష్యానికి మించి ఆదాయం సొం తం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సకాలంలో మార్కెట్ ఫీజు చెల్లించిన ఖరీదుదారులు, కమిషన్ వ్యాపారులు, సహకరించిన ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మార్కెట్‌కు పంట తీసుకొచ్చే రైతులకు సకల వసతులు కల్పించి, మంచి ధర వచ్చేవిధంగా చూడడమే మా ప్రధాన లక్ష్యం.