ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవంలో అన్ని వర్గాల ప్రజలనూ భాగస్వాములను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ మహాసభ సంబురాలను జయప్రదం చేయాలని కోరారు. రజతోత్సవాల విజయవంతం కోసం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవంలో పార్టీ శ్రేణులు ముందు భాగాన నిలిచి అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా రైతులను సంబూరాల్లో భాగం చేయాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ మదన్‌లాల్ పాల్గొన్నారు. -నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 5