మధిర, ఆగస్టు 19 : ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరం కోసం ఈ నెల 25న చేపట్టే ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు తేలప్రోలు రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మధిరలో ఆశావర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఆస్పత్రి ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు అండగా నిలవాలని కోరారు.