ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. తొలుత అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విద్యార్థులకు అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి
- వచ్చే నెల 15 లోగా ‘మన బడి’ పనులు పూర్తి చేయాలి
- డోలమైట్ మైన్స్ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలి
- అంగన్వాడీల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
- కారేపల్లి మండల పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
కారేపల్లి, జూలై 28: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. తొలుత అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విద్యార్థులకు అందజేస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి ‘మన ఊరు – మన బడి’ ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు.
ఆక్రమణకు గురైన కారేపల్లి పెద్దచెరువు శిఖం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మత్స్యకారులు చేపడుతున్న రిలేనిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకొని వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పెద్దచెరువు అలుగు ప్రదేశంలో గల స్థలాన్ని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి పరిశీలించారు. అనంతరం పేరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మాదారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెగా పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. అక్కడ నాటిన మొక్కలను, జరుగుతున్న పనులను పరిశీలించి స్థానిక సర్పంచ్ అజ్మీరా నరేశ్‌ను అభినందించారు. డోలమైట్ మైన్స్ అధికారులతో మాట్లాడుతూ వారి స్వాధీనంలో ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా మొక్కలు నాటాలని సూచించారు. కారేపల్లి క్రాస్‌రోడ్ నుంచి కారేపల్లి వరకు ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఎదుగుతున్న మొక్కలను చూసి ఎంపీడీవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. డీఆర్డీవో విద్యాచందన, డీఈవో యాదయ్య, ఇరిగేషన్ డీఈ వెంకట్‌నాయక్, తహసీల్దార్ రవికుమార్, సర్పంచ్‌లు ఆదెర్ల స్రవంతి, అజ్మీరా నాగేశ్వరరావు, అజ్మీరా అరుణ, అజ్మీరా నరేశ్, ఎంపీవో రాజారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

