ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 15 : అందరూ పేదింటి బిడ్డలే.. రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలే.. ఇంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ కసితో చదివి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. నాలుగేళ్లు చదివి రోగుల నాడి పట్టబోతున్నారు. వారి కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలూ డాక్టర్లు అయ్యేందుకు సర్వం సమకూర్చారు. శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం మొదటి సంవంత్సరం అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘కేసీఆర్ సార్ లేకపోతే మా లాంటి బీద కుటుంబీకులకు వైద్య విద్యలో అవకాశం వచ్చేది కాదు’ అని ఆనంద భాష్పాలు రాల్చారు. ముఖ్యమంత్రికి జీవితకాలం రుణపడి ఉంటామంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోగతం ఇలా&l నిరుపేదలకు వైద్య విద్య కేసీఆర్ ప్రసాదించిన వరం
ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 15 : అందరూ పేదింటి బిడ్డలే.. రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలే.. ఇంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ కసితో చదివి అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. నాలుగేళ్లు చదివి రోగుల నాడి పట్టబోతున్నారు. వారి కలలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకో వైద్య కళాశాలను మంజూరు చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలూ డాక్టర్లు అయ్యేందుకు సర్వం సమకూర్చారు. శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం మొదటి సంవంత్సరం అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘కేసీఆర్ సార్ లేకపోతే మా లాంటి బీద కుటుంబీకులకు వైద్య విద్యలో అవకాశం వచ్చేది కాదు’ అని ఆనంద భాష్పాలు రాల్చారు. ముఖ్యమంత్రికి జీవితకాలం రుణపడి ఉంటామంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోగతం ఇలా&
నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆందోళన కలిగించింది. ఈ దఫా నాకు మెడికల్ సీటు రాదని ఫిక్స్ అయ్యాను. కానీ.. సీఎం కేసీఆర్ సార్ ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీలను స్థాపించడం, తక్కువ కటాఫ్ పెట్టడంతో ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ కేసీఆర్ సార్.. మీరు మాలాంటి వాళ్లకోసం చేస్తున్న మంచి పనులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. నాతోపాటు మా తల్లిదండ్రుల సపోర్ట్ సార్కే ఉంటది.
-ఎం.తేజస్విని, వైద్య విద్యార్థిని, వరంగల్
మాది నిరుపేద కుటుంబం. నాన్న ఆటో డ్రైవర్. రోజువారీగా వచ్చే డబ్బులతోనే మా ఇంట్లో గడవాలి.చిన్నప్పటి నుంచి డాక్టర్ని కావాలన్నదే నా కోరిక. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ఖమ్మంలోని బేబీమూన్ పాఠశాలలో చదివాను. ఏడు, ఎనిమిది తరగతులు నేలకొండపల్లి గురుకుల పాఠశాలలో చదివాను. తొమ్మిది నుంచి ఇంటర్ వరకు కరీంనగర్ టీఎస్‌డబ్ల్యూఆర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో పూర్తి చేశాను. నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీటు వస్తుందో.. రాదోనని భయపడ్డాను. కానీ.. సీఎం కేసీఆర్ సార్ ఖమ్మానికి మెడికల్ కళాశాలను ఇవ్వడం, అందులో నాకు మెడికల్ సీటు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. మా నాన్న ఆకాంక్ష, నా కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్ అంకుల్‌కు చేతులెత్తి మొక్కుతున్న. మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
-కే.రమ్య, కమలాపురం, ముదిగొండ మండలం
నేను చేసేది చిరుద్యోగం. నా బిడ్డ డాక్టర్ చదవాలని ఆశపడింది. అది ఖరీదైనదని నాకు తెలుసు. మా లాంటి వాళ్లకు ఎలా సాధ్యమవుతది అని ఆలోచించే వాడిని. కడుపున పుట్టిన బిడ్డ కోరికను నెరవేర్చలేమోనని మనసులో కుమిలిపోయే వాడిని. సీఎం కేసీఆర్ ఎప్పుడైతే జిల్లాకో మెడికల్ కాలేజీని ఇస్తానని చెప్పిండో నాకు ధైర్యమొచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తాడని మాకు తెలుసు. అదే ఇప్పుడు నిజమైంది. సాధ్యం కాదనుకున్న వైద్య విద్య నా బిడ్డ కాళ్ల దగ్గరికి వచ్చింది. సీఎం కేసీఆర్ మేలు ఎన్నటికీ మర్చిపోం.
-ఎంఆర్ఎస్.శాస్త్రి, ప్రైవేట్ చిరుద్యోగి వరంగల్
మా నాన్నకు ఫుట్‌వేర్ షాపు ఉంది. నేను ఖమ్మంలోనే విద్యాభ్యాసం చేశాను. ఎక్కడైతే చదివానో అదే పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడం, అందులోనే సీటు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్న. ఫీజులు కూడా నామమాత్రంగా తీసుకున్నరు. ఈ విషయంలో మా కుటుంబం అంతా ఎంతో సంతోషపడుతున్నది. సీఎం కేసీఆర్ సార్ సెల్యూట్.
-ఎండీ.ఫిర్ధోసి, విద్యార్థిని, టేకులపల్లి, ఇల్లెందు నియోజకవర్గం
నేను గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న. నెత్తిన బండ రాళ్లను మోస్తున్నప్పటికీ నా కూతురిని డాక్టర్‌గా చూడాలని కలలుగన్నాను. కానీ.. అది అత్యంత ఖరీదైనదని తెలిసిన వారు చెబుతుంటే ఆశలు వదులుకున్న. సీఎం కేసీఆర్ ఖమ్మంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చెయ్యడం, అందులోనే నా బిడ్డకు మెడికల్ సీటు రావడంతో నా ఆనందానికి అవధులు లేవు. నా కుటుంబానికి సీఎం కేసీఆర్ దేవుడు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. సారు ఏలుబడిలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. తెలంగాణలో ఎప్పటికీ ఆయనే ఉండాలని ప్రతిరోజూ ప్రార్థన చేస్తున్నాం.
-దాసరి రవీంద్ర, గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీ
మా ఊరు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండల కేంద్రం. వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఎప్పటికైనా నా బిడ్డను డాక్టర్‌గా చూడాలన్నదే కోరిక. సీఎం కేసీఆర్ వల్ల నా కల ఫలించింది. తెలంగాణ కోసం ఆనాడు చేసిన ఉద్యమం, ప్రజల ఆకాంక్షలు ఈరోజు ఫలిస్తున్నాయి. నీళ్లు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు. రైతు బీమా ఇస్తున్నరు. ఉద్యోగాలు వస్తున్నాయి. మాలాంటి సామాన్య కుటుంబీకుల బిడ్డలకు ఖరీదైన చదువును అగ్గువకే అందిస్తున్నరు. ఇంకేం కావాలి.. మా కేసీఆర్ సారే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటారు.
-నాగవెళ్లి శ్రీనివాస్, రైతు, నల్లబెల్లి