వైరా, జూలై 21 : బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుడు కట్టా కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలను వైరాలో పార్టీ నాయకులు, అభిమానులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టా కృష్ణార్జునరావు కేక్ కట్ చేసి తన జన్మదిన ఆనందాన్ని కార్యకర్తలు, అభిమానులతో పంచుకున్నారు. పలువురు నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ మాజీ అధ్యక్షులు బాణా వెంకటేశ్వర్లు, మద్దేల రవి, అప్పం సురేష్, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు నల్లమోతు సురేష్, బీఆర్ఎస్ నాయకులు లాల్ మహమ్మద్, ఏదునూరి శ్రీనివాసరావు, సక్కుబాయి, దారెల్లి పవిత్ర కుమారి, నూకల వాసు, నూకల ప్రసాద్, మిట్టపల్లి కిరణ్, బొడ్డు రామకృష్ణ, వజినేపల్లి చక్రవర్తి, మిట్టపల్లి సత్యంబాబు, ఏలూరు నరసింహారావు, కొల్లా రాంబాబు, వేముల శివ, వీరన్న, సింగవరపు నరేష్, గూగులోత్ శివ, మాచర్ల శంకర్, వల్లేపు రాము పాల్గొన్నారు.

ఘనంగా కట్టా కృష్ణార్జునరావు జన్మదిన వేడుకలు