కారేపల్లి, నవంబర్ 24 : కారేపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్ధాయి వెయిట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపి పథకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇలియాట్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 21 నుండి 23వ వరకు వరంగల్‌లో రాష్ట్ర స్ధాయి వెయిట్ లిప్టింగ్ పోటీలు జరిగినట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఎం. భరత్ బంగారు పతకం, ఎస్.సాత్విక్, కె.నిక్షిత రజత పతకంలు, బి.ఇందు, నూతన్‌కుమార్ కాంస్య పతకాలు సాధించినట్లు వెల్లడించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులను ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్, పీడీ ముసా మోహినుద్దీన్ అభినందించారు.