కూసుమంచి, ఏప్రిల్ 25 : ఎవరెవరు ఎక్కడున్నా ఒక్కరోజు ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని, దీనిని పార్టీ పండుగలా భావించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కోరారు. కూసుమంచి మండలం మంగళితండా, ఈశ్వరమాధారం, రాజుపేట బజార్లో బీఆర్ఎస్ పార్టీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది.
ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ 25 ఏళ్లు తెలంగాణ హక్కులు, సమస్యలపైనే పోరాటం సాగించి సాధించుకున్న తెలంగాణాలో అన్ని వనరులు, వసతులు ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. రజితోత్సవ సభ కోసం ఇంటి పండుగలా కదిలిరావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ పార్టీ రజతోత్సవ సభకు పల్లెలన్నీ కదలిరావాలని, ఇందుకోసం వాహనాలు సమకూర్చుతామన్నారు. అలాగే పార్టీ జెండాలు ఎగురవేయాలని సూచించారు. మాజీ సీఎం ఖమ్మం నుంచి ఎక్కువగా తరలించాలని సూచించారని కోరారు. బీఆర్ఎస్ నాయకులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, బాలకృష్ణ, కొలిశెట్టి శ్రీను, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వైరా టౌన్, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతీ పల్లె నుంచి సైనికుల్లా కదలిరావాలని వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బానోతు మదన్‌లాల్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా స్థానిక రింగు రోడ్డు సెంటర్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి అన్ని వర్గాలకు అందించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, ముళ్లపాటి సీతారాములు, కృష్ణార్జున్‌రావు, విశ్వేశ్వరరావు, తడికమళ్ల నాగేశ్వరరావు, మాదినేని ప్రసాద్, మాదినేని లక్ష్మణ్, పారుపల్లి నాగం, కామినేని శ్రీనివాసరావు, కొత్తా వెంకటేశ్వరరావు, లాల్‌మహ్మద్, దొంతబోయిన వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.