కారేపల్లి, మే 12 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతలపాడులో హరిజన కాంట్రాక్ట్ లేబర్ సహకార సంఘం ఎన్నికలను సహకార శాఖ అధికారులు సోమవారం నిర్వహించారు. జిల్లా సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ షేక్ మౌలానా ఎన్నికను నిర్వహించారు. సంఘంలో పాలకవర్గానికి సంబంధించి చేతులు ఎత్తు పద్దతి ద్వారా ఎన్నికను నిర్వహించారు. కనకం ఉపేందర్, కంపాటి లక్ష్మయ్య, దూడ గణేశ్, మెంతిని సంధ్యా, దూడ కుమారి లను సంఘం మహాజన సభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
అనంతరం ఐదుగురు సభ్యుల నుండి అధ్యక్షుడిగా కనకం ఉపేందర్, ఉపాధ్యక్షుడిగా కాంపాటి లక్ష్మయ్య, కార్యదర్శిగా దూడ గణేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ అధికారులు చిలక రవి, పంచాయతీ కార్యదర్శి యలమద్ది మహేశ్. సోసైటీ అధికారులు దొడ్డ ముత్తయ్య, దమ్మాలపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Karepalli : హరిజన లేబర్ సోసైటీ అధ్యక్షుడిగా కనకం ఉపేందర్