– అమలు కాని హామీలతో కాంగ్రెస్ మోసం
– కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌కు మద్దతు పలకాలి
– బీఆర్ఎస్ నేత బానోత్ కృష్ణ
ఖమ్మం రూరల్, జనవరి 26 : బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు న్యాయం జరిగిందని ఆ ఆర్టీ నేత బానోత్ కృష్ణ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ డివిజన్ అందుగల గిఫ్కా నాయక్ నగర్, పాత పెద్ద తండా, టీచర్స్ కాలనీల్లో మాజీ వైస్ ఎంపీపీ బానోత్ సుజాత, స్థానిక మహిళలతో కలిసి ఆయన పెద్ద ఎత్తున గల్లి గల్లిలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు, కాంగ్రెస్ హామీలతో కూడిన ప్లకార్డ్స్ ను ధరించి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా ఉన్న హయాంలోలోనే గిరిజనులకు న్యాయం జరిగిందన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. గిరిజన తండాలలో గిరిజనులకి రాజ్యాధికారం ఉండాలని ఉద్దేశంతో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Khammam Rural : ‘బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు న్యాయం’
గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర రాజధానిలో గిరిజన భవన్ కు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినప్పటికీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేక పోయిందన్నారు. వృద్ధులకు పింఛను రూ.2 వేల నుండి 4 వేలకు పెంచుతామని, కల్యాణ లక్ష్మి పథకం కు తులం బంగారం జోడించి ఇస్తామని, విద్యార్థులకు స్కూటీలు, మహిళలకు నెల నెల రూ.2,500 ఇస్తామని హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఆ ఉసే మర్చిపోయారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం అందించాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌కు మద్దతు పలకాలని ఆయన కోరారు.

Khammam Rural : ‘బీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు న్యాయం’
ప్రభుత్వ ఉద్యోగులను సైతం మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం అందిస్తామని అబద్ధపు మాటలు చెప్పిందని, ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేస్తేనే ప్రజలకు వారు ఇచ్చిన వాగ్దానాలు గుర్తుకొస్తాయన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటిని ఇచ్చిన కేసీఆర్‌ను మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థికి బిఫామ్ ఇచ్చినా అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.