యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడల వైపు దృష్టి సారించాలని మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని దిడుగుపాడు షేర్ చేయూత డీ అడిక్షన్ సెంటర్ లో సి. గోపాలరెడ్డి అధ్యక్షతన శుక్రవారం అవగాహన సభకు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా మాట్లాడారు.
మధిర, జూన్ 26: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడల వైపు దృష్టి సారించాలని మధిర జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని దిడుగుపాడు షేర్ చేయూత డీ అడిక్షన్ సెంటర్ లో సి. గోపాలరెడ్డి అధ్యక్షతన శుక్రవారం అవగాహన సభకు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా మాట్లాడారు. అనంతరం ఆమె సభికులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు, డాక్టర్ ఏ. కొండలరావు, మాదవరపు నాగేశ్వరరావు, ఎక్సైస్ ఎస్ఐ జనార్ధన రెడ్డి, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సత్తుపల్లిటౌన్, జూన్26 : మండల న్యాయ సేవాధికార సంస్థ పానెల్ అడ్వకేట్స్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్‌తో శుక్రవారం సత్తుపల్లి ఎస్టీ బాలుర వసతిగృహంలో మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అడ్వకేట్ బొర్రా వెంకట్రావ్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ పాడుపడాలని తెలిపారు.
అడ్వకేట్ ఎన్.విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణ కలిగి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పింది వింటూ, చదువులతో ఉన్నత స్థాయిగా మెలగాలని, తోటివారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ బి.మల్లేశ్వరరావు, జే.వీ.నరేంద్ర మాట్లాడుతూ మత్తుపదార్థాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లగట్ల విజయ్‌కుమార్, బూసా మల్లేశ్వరరావు, జె.వి.నరేంద్ర, ఎం.శ్యామ్‌కుమార్, ఏఎన్ఎం బీ.లక్ష్మిసౌజన్య, కోర్టు, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

