వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా బయలుదేరి రావడంతో సభా ప్రాంగణం హోరెత్తింది.
మధ్యాహ్నం 3 గంటలకు సభకు హాజరైన సీఎం కేసీఆర్ వేదికపై నుంచి ప్రజలకు అభివాదం చేయడంతో ఆనందంతో మురిసిపోయారు. ‘జై కేసీఆర్.. జై జై కేసీఆర్.. జయహో కేసీఆర్’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. వైరా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బానోతు మదన్‌లాల్‌ను గెలిపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది.