ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో చేస్తున్న పర్యటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలూ భాగస్వాములయ్యాయి. సీఎం కేసీఆర్ వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి ఉన్నారు. అక్కడి పండరీపూర్లో శ్రీవిఠల రుక్మిణీదేవి ఆలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అక్కడ నిర్వహించిన బీఆర్ఎస్ సభలో మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియానాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండగాల రాజేందర్, వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
-ఖమ్మం/ ఇల్లెందు/ ఇల్లెందు రూరల్/ వైరా టౌన్, జూన్ 27: