భద్రాచలం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఐటీసీప్రథమ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐటీసీప్రథమ్ సంస్ధ జిల్లా కో- ఆర్డినేటర్ వెంకట్రామ్ తెలిపారు. 18 నుంచి 35 ఏండ్లు వయస్సు కలిగి 8 నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు భద్రాచలంలో వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు బ్యూటీషియన్, పురుషులకు ఎలక్ట్రీషీయన్ రంగంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు 9177641543 ఫోన్ నంబర్ సంప్రదించాలన్నారు.