ఖమ్మం: ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఈ జాబ్ మేళా ఉంటుందని చెప్పారు. పదోతరగతి ఉత్తీర్ణులై 18ఏళ్లు నిండిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 10 గంటల వరకు తమ అన్ని ఒరిజనల్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, పాస్ఫోటోలతో ఎల్ఐసీ కార్యాలయానికి రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు రఘుపతి ఫోన్నెం-8247656356కు సంప్రదించవచ్చు.