నేటి నుంచి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి తెలిపారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 3 : దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి తెలిపారు. జిల్లా లో 6 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మెయిన్స్ పరీక్షలకు 5,296 మంది, 12న జరిగే బీఆర్క్ పరీక్షకు 884 మంది హాజరవుతారని పేర్కొన్నారు. బొమ్మ ఇంజినీరింగ్, శ్రీచైతన్య ఇంజినీరింగ్, ఎస్బీఐటీ, విజయ ఇంజినీరింగ్, కవిత మెమోరియల్ డిగ్రీ, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
7న మోడల్ స్కూల్స్ పరీక్ష
తెలంగాణ మోడల్ స్కూల్స్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

