బోనకల్లు, మార్చి 20 : తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జక్కుల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 21వ ఖమ్మం జిల్లా మహాసభలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా తనను ఎంపిక చేసినందుకుగాను సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు చేసేది ఒక్క ఏఐకేఎస్ మాత్రమేనని అన్నారు.
రానున్న రోజుల్లో బోనకల్లు మండలంతో పాటు, ఖమ్మం జిల్లాలో ఏఐకేఎస్ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు చెప్పారు. రామారావు ఎంపిక పట్ల సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు తోట రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యుడు తూము రోషన్ కుమార్, మండల కార్యదర్శి యంగల ఆనందరావు, ఏఐకెఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పారుపల్లి నరసింహారావు, కొంగర భాస్కర్రావు, ఏలూరి పూర్ణచంద్రరావు, సహాయ కార్యదర్శి ఆకెన పవన్ హర్షం వ్యక్తం చేశారు.