మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ‘భద్రగిరి మార్ట్’
గిరిజన, ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్, సెర్ప్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్ పేర్కొన్నారు.
- భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్
భద్రాచలం, ఏప్రిల్ 1: గిరిజన, ఎస్‌హెచ్‌జీ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి జీవనోపాధి కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్, సెర్ప్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్ పేర్కొన్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నడుపుకుంటున్న మహిళలు తాము తయారు చేసే నిత్యావసర సరుకులు దళారులకు విక్రయించకుండా భద్రగిరి మార్ట్‌లో అందించి జీవనోపాధి పొందాలని సూచించారు.
పట్టణంలో గల భద్రగిరి మార్ట్‌లో నిత్యావసర సరుకులను సెర్ప్ సీనియర్ మేనేజర్‌తో కలిసి పీవో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ తాము తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని పలువురు గిరిజన మహిళలు కోరారని, దీంతో భద్రగిరి మార్ట్‌ను వారికి అనుకూలంగా మార్చడంతోపాటు ప్రజలకు నాణ్యమైన సరుకులను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందన్నారు.
అనంతరం మార్ట్‌లోని నిత్యావసర సరుకులను పరిశీలించి, వాటి తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్న సెర్ఫ్ సీనియర్ మేనేజర్.. తమ సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఏపీవో పవర్ వేణు, జేడీఎం హరికృష్ణ, డీఎం జీసీసీ సమ్మయ్య, మేనేజర్ ఆదినారాయణ, జీసీసీ మేనేజర్ జయరాజ్, భద్రగిరి మార్ట్ మేనేజర్ భార్గవి, డీపీఎం నర్సయ్య, ఏపీఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

