బూర్గంపహాడ్, ఆగస్టు 5 : గిరిజనులు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరించడంతోపాటు మిగిలిన వాటిని అధికారులకు అం దించి ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని సూచించారు.
గిరిజన దర్బార్లో ఎక్కువగా పోడు భూములు, వ్యక్తిగత, భూ సమస్య లు, స్వయం ఉపాధి పథకాలు, ట్రైకార్ రు ణాలు, గురుకుల కళాశాల, పాఠశాలల్లో సీట్ల కోసం, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం తదితరాలపై దరఖాస్తులు వచ్చినట్లు పీవో తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి.. అర్హులైన గిరిజనులకు విడతలవారీగా ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్య లు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్పేర్ డీడీ మణెమ్మ, ఈఈ తానా జీ, ఆర్సీవో నాగార్జునరావు, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఎస్వో, ఏపీవో, మునీర్పాషా, డీటీఆర్వోఎఫ్ఆర్ శ్రీనివాస్, ఉద్యానశాఖ అధికారి ఉదయ్, అగ్రికల్చర్ ఏడీ భాస్కర్, కొండరెడ్ల అధికారి నరేశ్ పాల్గొన్నారు.