అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. వివిధ సంస్థలు, ట్రస్టులు మహిళలకు పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. గ్రామాలు, పట్టణాల్లో సాధారణ ఫ్రజలు మహిళా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను సన్మానించారు. దానవాయిగూడెం ఏంజేపీలో సిబ్బంది ప్రిన్సిపాల్‌ను సన్మానించారు.