బోనకల్లు, ఆగస్టు 23 : బోనకల్లు మండల కేంద్రంలోని విద్య వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ రామకృష్ణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలో ఆధార్ నమోదు చేసుకోని విద్యార్థులను గుర్తించాలన్నారు. వారిని నమోదు కేంద్రానికి తీసుకువచ్చి పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట మండల విద్యాధికారి దామాల పుల్లయ్య, ఆధార్ నమోదు ఆపరేటర్ అమీర్ పాషా, ఎంఆర్సీ, సీఆర్పీలు ఉన్నారు.