కారేపల్లి (ఏన్కూర్) సెప్టెంబర్ 16 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ సీఈఓ, మండల పారిశుధ్య నిర్వహణ ప్రత్యేక అధికారి కొదుమూరి నాగపద్మజ మంగళవారం సందర్శించారు. ఓపి రిజిస్టర్, రోజువారి జ్వర పరీక్షల సర్వే వివరాలను పరిశీలించారు. డ్రై డే కార్యక్రమాల్లో భాగంగా టీఎల్ పేటలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. పీకే బంజర గ్రామ పంచాయతీ ఆవాసమైన పైనంపల్లి తండాను సందర్శించి గ్రామ ప్రజలకు పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి కె.గోపి, పంచాయతీ కార్యదర్శులు సుస్మిత, పి.కె.బంజర గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Karepally : టీఎల్ పేట, పీకే బంజరలో పారిశుధ్య కార్యక్రమాల పరిశీలన