సత్తుపల్లి టౌన్, మార్చి 31 : నిత్యజీవితంలో మనకు తెలిసిన అనేక సాధారణ అంశాల వెనుక గల విజ్ఞాన విషయాలపై పట్టణానికి చెందిన విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులు వినూత్న విశ్లేషణ జరిపి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసాపత్రం సాధించారు. ఆదివారం ఉదయం విశ్వశాంతిలో జరిగిన కార్యక్రమంలో 62 మంది విద్యార్థులు నిత్య జీవితానికి సంబంధించి 62 విషయాలను వివరిస్తూ వాటి వెనుక ఉన్న సైన్స్ కారణాలను విశ్లేషణ చేస్తూ ఆయా అంశాలకు సంబంధించి వీడియోలను ప్రదర్శించారు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులుగా ఖమ్మం నుంచి శ్రీనివాస్, సత్తుపల్లి నుంచి బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా సైన్స్ ఉపాధ్యాయులు ప్రసాద్, శేషుకుమార్ వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం సంస్థ తరఫున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసాపత్రం అతిథులు పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ పసుపులేటి నాగేశ్వరరావు, విద్యావేత్త, విద్యాసంస్థల అధిపతి లక్కినేని ప్రసాద్, మధుసూదన్‌రాజు, సత్యనారాయణ, నీలాద్రి ఆలయకమిటీ డైరెక్టర్ రామిశెట్టి శ్రీనివాస్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.