సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వ్యవహారం సింగరేణి మండలం గంగారంతండా గ్రామంలో వివాదానికి దారితీసింది. గ్రామసభ తీర్మానాల్లో సర్పంచ్ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపాదనలు రూపొందించి అధికారులకు సమర్పించడం, వాటిని అధికారులు ఆమోదించి విచారణ చేపట్టడంపై గ్రామ సర్పంచ్ కిరణ్..
– సింగరేణి మండలం గంగారంతండాలో ఘటన
– అర్హత లేని వారికి ఇళ్ల కేటాయింపుపై సర్పంచ్ కిరణ్ తీవ్ర అభ్యంతరం
– మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన సర్పంచ్
– కలెక్టర్ స్పందించకుంటే న్యాయపోరాటం చేస్తాం
కారేపల్లి, నవంబర్ 05 : ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వ్యవహారం సింగరేణి మండలం గంగారంతండా గ్రామంలో వివాదానికి దారితీసింది. గ్రామసభ తీర్మానాల్లో సర్పంచ్ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపాదనలు రూపొందించి అధికారులకు సమర్పించడం, వాటిని అధికారులు ఆమోదించి విచారణ చేపట్టడంపై గ్రామ సర్పంచ్ కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ను పక్కనపెట్టి గ్రామంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఇళ్లు ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల పేర్లను సైతం ఇళ్ల మంజూరు జాబితాలో చేర్చేందుకు తీర్మానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి కనీస సమాచారం ఇవ్వకుండా గ్రామసభ తీర్మానాలు రూపొందించడం, సర్పంచ్ సంతకం లేకుండానే ఎంపీడీవోకు ప్రతిపాదనలు సమర్పించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావును గురువారం హైదరాబాదులో కలిసి గంగారంతండా సర్పంచ్ కిరణ్ పూర్తి వివరాలు వివరించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సర్పంచ్ సంతకం లేకుండా ప్రతిపాదించిన ఏడు ఇందిరమ్మ ఇళ్లను మండల వ్యవసాయ అధికారి, ప్రత్యేక విచారణ అధికారి అశోక్ క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు కిరణ్ తెలిపారు. పరిశీలనలో నాలుగు ఇళ్లకు ఇప్పటికే డాబాలు ఉన్నట్లు గుర్తించి వాటిని తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ పరిణామాలే ఇళ్ల ఎంపిక ప్రక్రియలో మరింత లోతైన విచారణ అవసరాన్ని తెలియజేస్తున్నాయన్నారు. గ్రామస్థాయిలో జరిగిన తీర్మానాలు,లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించకుండా సమస్యను నిర్లక్ష్యం చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని సర్పంచ్ హెచ్చరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
AP News | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి..!
సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
Nazriya Fahadh | సూర్యతో మూడు సినిమాలు మిస్.. ఇంతకీ నజ్రియా నజీమ్ ఏం చెప్పిందంటే..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

