AP News | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి..!
AP News | ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరంలో కీలక ఘట్టమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా ఉదయం పోలింగ్ మందకొడిగా సాగినా, మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.
AP News : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరంలో కీలక ఘట్టమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా ఉదయం పోలింగ్ మందకొడిగా సాగినా, మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. చెదురుమదురు ఘర్షణలు, వాగ్వాదాలు మినహా పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 58.55% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. పోలింగ్ ముగిసే సమయానికి 65 నుంచి 68 శాతం మధ్య ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా.. కొన్ని గిరిజన, తీర ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తక్కువగా నమోదైనట్లు సమాచారం. ఈ ఎన్నికల బరిలో నిలిచిన సుమారు 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకుగాను 77 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 9,821 ఎంపీటీసీ స్థానాలకుగాను 2,051 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగినప్పటికీ.. పల్నాడు, అనంతపురం, చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి.
కొన్ని చోట్ల ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనల వల్ల పోలింగ్‌కు పెద్దగా అంతరాయం కలగలేదు. పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీళ్లు వేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ వాటిని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
ఏవైనా కేంద్రాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే నవంబర్ 6న అక్కడ రీ-పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాల ఆధారంగా నవంబర్ 11, 12 తేదీల్లో ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి..!
సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
Nazriya Fahadh | సూర్యతో మూడు సినిమాలు మిస్.. ఇంతకీ నజ్రియా నజీమ్ ఏం చెప్పిందంటే..?
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

