సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు అన్నారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 5: యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు మండల పరశురాములు అన్నారు. హనుమకొండ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జిల్లాస్థాయి యువజనోత్సవం బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ హాజరై వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆకులపెల్లి మధు, మౌనిక, నయీమ్, యువజన క్రీడల శాఖ సిబ్బంది, పలువురు యువజన సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు. వివిధ పోటీలలో విజేతల వివరాలు.. కవితా రచన పోటీలో ప్రథమ బహుమతి జి. ఆకాంక్ష ద్వితీయ బహుమతి ఎన్. వైష్ణవి, చిత్రలేఖన పోటీలో ప్రథమ బహుమతి పి.శ్రీనిక, ద్వితీయ బహుమతి డి.వాహిని, నుక్కడ్ నాటక్ పోటీ కౌశల్ బృందం, జానపద గీతాల బృంద పోటీలో ప్రథమ బహుమతి ఎస్.కె. ఖైరాన్, ద్వితీయ బహుమతి కావేరి, జానపద బృంద నృత్య పోటీలో ప్రథమ బహుమతి సిరి పౌర్ణమి బృందం, ద్వితీయ బహుమతి పరశురామ్ బృందం యువతకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత విద్యతో పాటు కళలు, క్రీడలు, సామాజిక సేవ, నాయకత్వ లక్షణాలలో కూడా ముందుండాలని పిలుపునిచ్చారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన విజేతలందరికీ జాతీయ యువజన అవార్డు గ్రహీతలు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
ప్రభాత్‌నగర్ కాలనీ పార్కును కాపాడుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
Nazriya Fahadh | సూర్యతో మూడు సినిమాలు మిస్.. ఇంతకీ నజ్రియా నజీమ్ ఏం చెప్పిందంటే..?
AP News | ఏపీలో గుండెపోటుతో ఎన్నికల అధికారిణి దుర్మరణం..!
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

